Homeటాప్ స్టోరీస్కియారా టాప్ లెస్ ఫోటోషూట్ పై ఎలా స్పందించింది?

కియారా టాప్ లెస్ ఫోటోషూట్ పై ఎలా స్పందించింది?

Kiara Advani hot poses comments
Kiara Advani hot poses comments

సాధారణంగా ఎవరైనా నటీమణులు ఫేడవుట్ అవుతున్నారు అన్నప్పుడే గ్లామర్ ఫోటోషూట్ చేసేవారు. తాము గ్లామర్ పరంగా ఓకే అని చెప్పడానికన్నట్లుగా ఈ ఫోటోలు ఉంటాయి. తమలోని హాట్ యాంగిల్ ను ఈ ఫోటోల ద్వారా బయటకు తీస్తుంటారు. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బిజీగా ఉన్న హీరోయిన్లు కూడా ఇప్పుడు గ్లామర్ ఫోటోషూట్ పరంగా ఎక్కడా తగ్గట్లేదు. ఉదాహరణకు కియారా అద్వానీనే తీసుకుంటే అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సూపర్ హిట్ తర్వాత కియారా రేంజ్ మారిపోయింది. ఆమె ఇప్పుడక్కడ చాలా బిజీగా ఉన్న నటి. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న కియారా రీసెంట్ గా ఒక గ్లామర్ ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోకు టాప్ లెస్ గా కేవలం ఒక ఆకు మాత్రమే అడ్డం పెట్టుకుని కనిపించిన కియారా యువకులకు చాలానే నిద్రలేని రాత్రుల్ని మిగిల్చింది. సోషల్ మీడియాలో అయితే ఈ ఫోటో గురించి చాలానే రచ్చ జరిగింది.

సోషల్ మీడియా అంటేనే అంత. అటు పాజిటివ్ సైడ్, ఇటు నెగటివ్ సైడ్ రెండూ ఉంటాయి. తన ఫొటోకు ఈ రెండు రకాల స్పందనలను చూశానని చెప్పుకొచ్చింది కియారా. కొంతమంది వల్గర్ గా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారని, అవి ఎంతకూ తగ్గకపోవడంతో డైరెక్ట్ మెసెజ్ లను ఆఫ్ చేయాల్సి వచ్చింది తెలిపింది.

- Advertisement -

అలాగే కొంతమంది చాలా ఫన్నీగా రియాక్ట్ అయ్యారని, ఆ ఆకును తానైతే బాగుండేదని అన్నారని, అవి చూసి నవ్వుకున్నానని తెలిపింది. ఈ కామెంట్లు తాను చాలానే చూశానని, కొన్నిటికి లైక్ చేసానని తనకు కూడా నచ్చాయని చెప్పింది. కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఆ ఫోటో ట్రై చేశా. మీకు కూడా నచ్చిందా అయితే తనకు కూడా నచినట్లే అని అంటోంది కియారా.

ఏదేమైనా కియారా ఇలా స్పోర్టివ్ గా రియాక్ట్ అవ్వడం పట్ల ఆమె అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All