Homeటాప్ స్టోరీస్రామ్ చరణ్ - శంకర్ చిత్రానికి బాలీవుడ్ బ్యూటీ కన్ఫర్మ్

రామ్ చరణ్ – శంకర్ చిత్రానికి బాలీవుడ్ బ్యూటీ కన్ఫర్మ్

రామ్ చరణ్ - శంకర్ చిత్రానికి బాలీవుడ్ బ్యూటీ కన్ఫర్మ్
రామ్ చరణ్ – శంకర్ చిత్రానికి బాలీవుడ్ బ్యూటీ కన్ఫర్మ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ ప్యాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. శంకర్ ఆధ్వర్యంలో కాస్ట్ అండ్ క్రూను ఫైనలైజ్ చేస్తున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా, ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడిగా కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. సాయి మాధవ్ బుర్రా డైలాగులను రాస్తున్నాడు.

ఇప్పుడు ఈ చిత్ర హీరోయిన్ ను కూడా కన్ఫర్మ్ చేసారు. బాలీవుడ్ టాప్ బ్యూటీగా ఫుల్ బిజీగా ఉన్న కియారా అద్వానీ ఈ చిత్రంలో నటించబోతోంది. ఈ న్యూస్ ను ఈరోజు అధికారికంగా ప్రకటించారు. రామ్ చరణ్, కియారా కలిసి నటించిన వినయ విధేయ రామ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెల్సిందే.

- Advertisement -

అయితే ఈసారి మాత్రం లెక్కలు సరిచేస్తామంటున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ లెవెల్లో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం గురించి మరింత సమాచారం త్వరలోనే బయటకు రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All