
ఈ మధ్య సోషల్ మీడియాలో నర్మగర్భంగా పోస్ట్‌లు పెట్టడం ఎక్కువైపోయింది. ఎవరు ఎవరిని ఉద్దేశించి పంచ్‌లు వేస్తున్నారో చాలా వరకు కన్ఫ్యూజన్ నెలకొంటోంది. ఈ తరహా పోస్ట్‌లని ముందుగా మొదలుపెట్టింది హీరోయిన్ పూనమ్‌కౌర్. రెండు బెత్తం దెబ్బలు.. డెవిల్స్‌పై పోరాడేందుకు శక్తినివ్వండి అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసి టాలీవుడ్‌లోనూ, అటు రాజకీయాల్లోనూ అటెన్షన్ క్రియేట్ చేసింది. తాజాగా సీనియర్ నటి ఖుష్బూ కూడా ఈ జాబితాలో చేరిపోయింది.
తాజాగా ఆమె ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కొంతమంది మహిళలు ఎప్పుడూ మారరు, నేర్చుకోరు. ఈ విషయంలో వారు చాలా పూర్` అని ఖుష్బూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ రీట్వీట్‌లు కొట్టడం ఆసక్తికరంగా మారింది. అంటే ఖుష్బూ ట్వీట్ చేసింది `బంగారం` హీరోయిన్ మీరాచోప్రాని ఉద్దేశించని తేలిపోతోంది.
గత రెండు రోజులుగా మీరా చోప్రాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మథ్య సోషల్ మీడియాలో అగ్లీ ఫైట్ జరుగుతున్న విషయం తెలిసిందే. తనకు ఇష్టమైన హీరో మహేష్‌బాబు అని, ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని మీరాచోప్రా చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఆమెకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. బూతు పురాణం వరకు వెళ్లడం తెలిసిందే. అయితే లౌక్యం నేర్చుకోవాలని, తమని తాము మార్చుకోవాలని ఈ సందర్భంగా ఖుష్బూ వ్యాఖ్యానించడం దానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వంత పడటం ఈ వివాదం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది.