Homeటాప్ స్టోరీస్ఫొటోల‌తో షాక్‌..మూడు నెల‌ల్లో ఇంత మార్పా?

ఫొటోల‌తో షాక్‌..మూడు నెల‌ల్లో ఇంత మార్పా?

ఫొటోల‌తో షాక్‌..మూడు నెల‌ల్లో ఇంత మార్పా?
ఫొటోల‌తో షాక్‌..మూడు నెల‌ల్లో ఇంత మార్పా?

క‌రోనా వైర‌స్‌ ఎంతగా చెడు చేస్తోందో అదే స్థాయిలో మాన‌వాళికి మంచి చేస్తోంది. లాక్‌డౌన్ కార‌ణంగా నిత్యం ర‌ద్దీగా పొగ‌తో క్ష‌ణం తీరిక లేని రోడ్ల‌తో.. వాహ‌నాల శ‌బ్ద కాలుష్యంతో మారుమ్రోగిన భూగోళం ఒక్క‌సారిగా స్థంభించి పోయింది. దీంతో వాతావ‌ర‌ణ కాలుష్యం క్ర‌మంగా త‌గ్గిపోయింది. స‌ముద్రాల్లో చాలా వ‌ర‌కు మ‌లినాల‌న్నీ మ‌టుమాయం అయిపోయాయి.

ప్ర‌కృతితో పాటు మ‌నుషుల్లోనూ మార్పులు రావ‌డం విశేషం. లాక్‌డౌన్ కారణంగా గ‌త 70 రోజుల‌కు మించి ఇంటికే ప‌రిమిత‌మైన వారంతా కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. ఫిట్ నెస్ కోసం యోగాని కొంత మంది ఆశ్ర‌యిస్తే మ‌రి కొంత మంది ఇష్ట‌మైన వంట‌లు చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అయితే సీనియ‌ర్ న‌టి ఖుష్బూ మాత్రం మ‌రోలా షాకిచ్చింది.

- Advertisement -

ముద్దుగా బొద్దుగా క‌నిపించి త‌మిళ ప్రేక్ష‌కుల చేతి గుడి క‌ట్టించుకుని పూజ‌లందుకున్న ఖుష్బూ ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఏకంగా 15 కేజీలు బ‌రువు త‌గ్గడం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. స్లిమ్ లుక్‌లో తాజాగా ట్విట్ట‌ర్‌లో ఆమె షేర్ చేసిన ఫొటోలో షాకిస్తున్నాయి. మూడు నెల‌ల్లో ఖుష్బూలో ఇంత మార్పా? అని అంతా అవాక్క‌వుతున్నారు. మ‌ళ్లీ హీరోయిన్‌గా క‌నిపిస్తోంద‌ని ఫ్యాన్స్ కామెంట్‌లు చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All