Monday, October 3, 2022
Homeటాప్ స్టోరీస్బాలీవుడ్ లో రవితేజ కు నిరాశే ఎదురైంది

బాలీవుడ్ లో రవితేజ కు నిరాశే ఎదురైంది

బాలీవుడ్ లో రవితేజ కు నిరాశే ఎదురైంది
బాలీవుడ్ లో రవితేజ కు నిరాశే ఎదురైంది

క్రాక్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న మాస్ రాజా రవితేజ..గత వారం ఖిలాడీ మూవీ తో తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రమేష్ వర్మ డైరెక్ట్ చేయగా..డింపుల్ హయతీ, మీనాక్షి లు హీరోయిన్లు గా నటించగా, మురళి శర్మ , అనసూయ , వెన్నెల కిషోర్ మొదలగు వారు పలు పాత్రల్లో నటించారు. ఈ మూవీ మొదటి రోజు మొదటి ఆట తోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కేవలం తెలుగు లోనే కాదు హిందీ లోను ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది.

- Advertisement -

మాములుగా రవితేజ నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్ లో యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంటాయి. యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబట్టడం, రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ నార్త్ లో బ్లాక్ బస్టర్ కావడం తో ..ఖిలాడీ చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్స్ – ఎ స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి పెన్ ఇండియా వారు నార్త్ లో భారీ ఎత్తున రిలీజ్ చేసారు.

కానీ ప్లాప్ టాక్ రావడం తో ఓపెనింగ్స్ ఏమాత్రం రాలేదు. దీంతో భారీ ప్లాప్ తో రవితేజకు బాలీవుడ్ స్వాగతం పలికినట్లైంది. ఇక తెలుగు లోను ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో పాటు రిలీజ్ అయ్యిన డీజే టిల్లు అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts