Homeటాప్ స్టోరీస్ఖిలాడీ కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉందంటే

ఖిలాడీ కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉందంటే

ఖిలాడీ కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉందంటే
ఖిలాడీ కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉందంటే

మాస్ మహారాజా రవితేజ – రమేష్ వర్మకలయికలో తెరకెక్కిన సినిమా ఖిలాడీ. ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 11న )ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా తర్వాత రవితేజ నుంచి వచ్చిన రెండో సినిమా ఇది. ఈ సినిమా కంటే ముందు క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు రవితేజ. ఇప్పుడు అదే జోష్ లో ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.

మొదటి రోజు మొదటి ఆట తోనే నెగిటివ్ టాక్ రావడం తో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ ఫై భారీగా పడింది. మొదటి రోజు భారీగానే కలెక్షన్లు రాబట్టగా రెండో రోజు నుండి దారుణంగా పడిపోయాయి. మరోపక్క శనివారం రిలీజ్ అయినా డీజే టిల్లు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం..యూత్ ఈ చిత్రానికి బ్రహ్మ రధం పడుతుండడంతో ఖిలాడీ థియేటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ ఐదు రోజులకు గాను రెండు రాష్ట్రాల్లో రూ.9.35కోట్ల కోట్లు షేర్, రూ. 15.80 కోట్లు గ్రాస్ సాధించింది.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు కలెక్షన్స్ చూస్తే..

* నైజాంలో రూ.20 లక్షలు
* సీడెడ్‌లో రూ. 14 లక్షలు
* ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు
* ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు
*  వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు
* గుంటూరులో రూ. 6 లక్షలు
* కృష్ణాలో రూ. 5 లక్షలు
* నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 0.72 కోట్లు షేర్, రూ. 1.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All