Homeగాసిప్స్ఖైదీ ఆన్లైన్ రిలీజ్ పై తమిళనాట దుమారం

ఖైదీ ఆన్లైన్ రిలీజ్ పై తమిళనాట దుమారం

ఖైదీ ఆన్లైన్ రిలీజ్ పై తమిళనాట దుమారం
ఖైదీ ఆన్లైన్ రిలీజ్ పై తమిళనాట దుమారం

ఓటిటి ప్లాట్ఫార్మ్స్… అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటివన్నమాట. ఇవి వచ్చాక ప్రేక్షకులు సినిమాలు చూసే పద్దతి మారిపోయింది. అసలు కొన్ని సినిమాలకు అమెజాన్ వంటి వాటిలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేస్తున్నారు. సినిమా పోస్టర్ మీదే ఆ సినిమా ఎక్కడ విడుదలవుతుందో వేస్తుండడంతో జనాలు ఆ చిత్రం ఆన్లైన్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడమనేది బొత్తిగా తగ్గిపోయింది. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఎప్పటినుండో గొడవ చేస్తున్నాడు. నెల రోజుల్లోనే సినిమాను డిజిటల్ గా రిలీజ్ చేసుకునే పర్మిషన్ ఇవ్వడం వల్ల థియేటర్ లో సినిమా చచ్చిపోతుందని సురేష్ బాబు అంటూనే ఉన్నాడు. నిర్మాతలు అందరూ ఈ విషయంలో కలిసి రావాలని కనీసం మూడు నెలలు ఆ ఓటిటి ప్లాట్ఫామ్స్ లో విడుదల కాకుండా చూడాలని, చిన్న సినిమాలకైతే పర్లేదు కానీ మీడియం బడ్జెట్, కొంచెం పేరున్న సినిమాలకు ఈ పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుందని వాపోయాడు. ఇప్పుడు కాదు గత ఏడాదిన్నర కాలం నుండి సురేష్ బాబు ఈ విషయంలో మొత్తుకుంటూనే ఉన్నాడు.

అయితే నిర్మాతలు భారీ స్థాయిలో డబ్బులు చూస్తుండడంతో సురేష్ బాబు వంటి పెద్దల మాటలను పెడచెవిన పెట్టారు. మీడియం బడ్జెట్ సినిమాలకే 10 కోట్ల దాకా ఓటిటి ప్లాట్ఫార్మ్స్ వాళ్ళు ఆఫర్ చేస్తుండడంతో సులువుగా పెట్టుబడి తిరిగి రాబట్టుకోవచ్చని చెప్పి నిర్మాతలు సినిమాలను వాళ్ళకే నెల రోజుల్లోపు స్ట్రీమ్ చేసుకోమని కట్టబెట్టేసారు. అయితే దాని దుష్పరిణామాలు ఇప్పుడు నిర్మాతలు అనుభవిస్తున్నారు. నెమ్మదిగా ఒక్కొక్కరికీ ఇది ఎంత చేటు చేస్తుందనేది అర్ధమవుతోంది. థియేటర్ కు వచ్చే జనాల సంఖ్య దారుణంగా తగ్గిపోతోంది. దీని వల్ల థియేటర్లు అన్నీ వీకెండ్ దాటగానే వెలవెలబోతున్నాయి. సినిమా అనేది ఇప్పుడంతా వీకెండ్ బిజినెస్ అయిపోయింది. తాజాగా కార్తీ నటించిన ఖైదీ తమిళ వెర్షన్ ఇలా ఓటిటి ప్లాట్ఫార్మ్స్ లో రావడం పెద్ద దుమారమే రేపింది.

- Advertisement -

దీపావళికి విడుదలైన ఈ సినిమా సరిగ్గా నెల రోజులకు హాట్ స్టార్ లో దర్శనమిచ్చింది. దీనిపైఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మండిపడుతున్నారు. ఇప్పటికీ ఈ సినిమా తమిళ్ లో బాగా ఆడుతోంది. కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ కూడా అవుతున్నాయి. సినిమా ఇంత బాగా ఆడుతున్నప్పుడు అసలు ఎలా డిజిటల్ లో రిలీజ్ చేసేస్తారని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. ఉచితంగా సినిమా చూసుకునే అవకాశం ఉన్నప్పుడు థియేటర్ దాకా ఎవడొస్తాడని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామ్ ముత్తురామ్ మల్టీప్లెక్స్ ఓనర్లు అయితే తమ దగ్గర ఈ సినిమా మూడు షో లకు రెండు హౌస్ ఫుల్స్ అవుతున్నాయని ఇప్పుడు ఇలా ఆన్లైన్ రిలీజ్ చేయడం చూసి షాకయ్యామని అంటున్నారు. అయితే ఖైదీ నిర్మాత ఎస్.ఆర్.ప్రభు మాత్రం పైరసీ పెరిగిపోతుండడంతో కలెక్షన్ల పై ప్రభావం పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అర్ధం చేసుకోవాలని కోరుతున్నాడు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All