
`ఖైదీ` చిత్రంతో లోకేష్ కనకరాజ్ దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తమిళ సూపర్‌స్టార్ విజయ్‌తో `మాస్టర్` చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇదిలా వుంటే అతనికి కమల్‌హాసన్‌ని డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ నటింస్తూ నిర్మించబోతున్నారు.
ఇటీవల `వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లీవ్డ్ ఏ ఘోస్ట్.. ` అంటూ ప్రీలుక్ కాన్సెప్ట్ పోస్టర్‌ని వదిలిన విషయం తెలిసిందే. ఇప్పటికి షూటింగ్ ప్రారంభం కాలేదు. క్లాప్ కూడా కొట్టలేదు కానీ ఈ మూవీ నుంచి టీజర్ రాబోతోంది. ట్రయల్ షూట్ కోసం కమల్‌పై కొన్ని సన్నివేశాలు చేశారట. దీనికి సంబంధించిన సీన్‌లలోని కీలక అంశాలని తీసుకుని టీజర్ రిలీజ్ చేయబోతున్నారట.
నవంబర్ 7న కమల్‌హాసన్ పుట్టిన రోజు జరగబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీజర్‌ని రిలీజ్ చేయబోతున్నారట. పుట్టిన రోజు మరో 7 రోజులు వుండటంతో అప్పుడే టీజర్ ని ఫైనల్ గా కట్ చేసే పనుల్లో బిజీగా మారిపోయాడట దర్శకుడు లోకేష్ కనకరాజ్.