కన్నడ హీరో యాష్ – ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన కేజీఎఫ్ మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలియంది కాదు..అన్ని భాషల్లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు త్వరలో దీనికి సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే ఈ సీక్వెల్ తాలూకా ప్రమోషన్ మొదలుపెట్టగా.. ‘తూఫాన్ తేఫాన్..’ అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లో యూట్యూబ్ లో ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసి వార్తల్లో నిలిచింది.
లిరికల్ వీడియో సాంగ్ సరికొత్తగా ఉండటం, ఈ సినిమా కోసం ఆల్రెడీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఉండటంతో ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ పాట రిలీజ్ అయిన 24 గంటల్లో 5 భాషల్లో కలిపి అ ఏకంగా 26 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను దక్కించుకుని ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. అంతేగాక ఈ లిరికల్ సాంగ్‌కు 2 మిలియన్ ప్లస్ లైకులు కూడా దక్కాయి. ఈ సినిమాలో యశ్ సరసన అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ రవీనా టండన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా, హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను భారీ బడ్జెత్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.