
సంచలన విజయం సాధించిన కేజీఎఫ్ చిత్రానికి స్టెంట్ మ్యాన్ గా పనిచేసిన రఘు హత్యకేసులో అరెస్ట్ అయ్యాడు . సంచలనం సృష్టించిన ఈ సంఘటనతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది . చిత్ర పరిశ్రమలో రకరకాల ఆరోపణలు , గొడవలు ఉన్నాయి కానీ హత్య కేసులు ఉన్న దాఖలాలు అంతగా లేవు , కానీ ఓ స్టెంట్ మ్యాన్ హత్యకేసులో అరెస్ట్ కావడం సినీ వర్గాలను షాక్ కి గురయ్యేలా చేస్తోంది .
రఘు అనే వ్యక్తి తన స్నేహితురాలిని బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని చంపేశాడు . దాంతో పోలీసులు స్టెంట్ మ్యాన్ రఘు తో పాటుగా అతడి స్నేహితురాలిని అలాగే రఘుకు హత్యలో సహకరించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసారు కర్ణాటక పోలీసులు . రఘు అనే స్టెంట్ మ్యాన్ పలు కన్నడ చిత్రాల్లో యాక్షన్ సీన్స్ లో నటించాడు .
- Advertisement -