HomeVideosరికార్డులు సృష్టిస్తున్న`కేజీఎఫ్ 2` టీజ‌ర్!

రికార్డులు సృష్టిస్తున్న`కేజీఎఫ్ 2` టీజ‌ర్!

రికార్డులు సృష్టిస్తున్న`కేజీఎఫ్ 2` టీజ‌ర్!
రికార్డులు సృష్టిస్తున్న`కేజీఎఫ్ 2` టీజ‌ర్!

సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `కేజీఎఫ్‌2`. క‌న్న‌డ రాక్‌స్టార్ య‌ష్ హీరోగా న‌టించిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ చాప్ట‌ర్ 1 సంచ‌ల‌నం సృష్టించ‌డంతో చాప్ట‌ర్ 2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

శుక్ర‌వారం హీరో య‌ష్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం టీజ‌ర్‌ని ఉద‌యం 10:18 నిమిషాల‌కు రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసింది. కానీ ఆ ప్లాన్‌ని ఎవ‌రో ఫ్లాప్ చేసి గురువారం రాత్రే `కేజీఎఫ్ 2` టీజ‌ర్‌ని సోష‌ల్ మీడియాలో లీక్ చేశారు. దీంతో టీమ్ ఒక్క‌సారిగా షాక్ కు గురైంది. ఈ విష‌యం తెలిసి హీరో య‌ష్ స్పందించారు. `ఎవ‌రో మ‌హానుభావుడు టీజ‌ర్‌ను ముందే విడుద‌ల చేశాడు. అలా విడుద‌ల చేయ‌డం ద్వారా వారికి ఏం లాభం చేకూరుతుందో నాకు తెలియ‌దు. దేవుడు వారికి అంతా మంచి చేయాలి` అని ఓ వీడియోని విడుద‌ల చేశారు. అనుకున్న‌దాని క‌న్నా ముందే వ‌చ్చిన `కేజీఎఫ్ 2` టీజ‌ర్ సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

- Advertisement -

ఇప్ప‌టికే 15 మిలియ‌న్‌లు దాటి రికార్డు సృష్టిస్తోంది. తొలి భాగాన్ని గ‌రుడ‌ని అంతం చేయ‌డంతో ముగించిన ప్ర‌శాంత్ నీల్ మ‌లి భాగాన్ని రాఖీభాయ్ కేజీఎఫ్‌ని త‌న సామ్రాజ్యంగా మ‌లుచుకున్న తీరుని, అందుకు అడ్డుగా నిలిచిన వారిని.. వారితో రాఖీభాయ్ సాగించిన పోరాటం నేప‌థ్యంలో ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది. హిస్ట‌రీ టెల్స్ అస్.. ద ప‌వ‌ర్‌ఫుల్ పీపుల్స్ కమ్ ఫ్ర‌మ్‌ ప‌వ‌ర్‌ఫుల్ ప్లేసెస్.. హిస్ట‌రీ వాస్ రాంగ్‌.. ప‌వ‌ర్‌ఫుల్ పీపుల్స్ మేడ్ ప్లేసెస్‌… ప‌వ‌ర్‌ఫుల్‌.. ఈ వాయిస్ ఓవ‌ర్‌తో మొద‌లైన `కేజీఎఫ్ 2` టీజ‌ర్ .. తొలి భాగానికి మించి మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా వుండేలా క‌నిపిస్తోంది.  రాఖీభాయ్ సామ్రాజ్యం.. ఇనాయ‌త్‌ఖ‌లీ ఇండియాలోకి ప్ర‌వేశించ‌డానికి ఎం చేశాడు? చ‌నిపోయాడ‌నుకున్న అధీరా మ‌ళ్లీ ఎలా తిరిగి వ‌చ్చాడు?.. గ‌రుడ‌ని చంప‌మ‌ని రాఖీని పంపిన వ‌ర్గం ఊరికే వుందా.. రాఖీపై ఎలాంటి దాడికి దిగింది?  .. రాఖీ భాయ్‌ని ఫినిష్ చేయ‌మ‌ని నాటి భార‌త ప్ర‌ధాని ర‌మికా సేన్ డెత్ వారెంట్ ఇష్యూ చేసింది? అనే ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All