Homeటాప్ స్టోరీస్`కేజీఎఫ్-2` కీసీన్ లీక‌యిపోయిందా?

`కేజీఎఫ్-2` కీసీన్ లీక‌యిపోయిందా?

 

KGF- chapter 2 kry scene video leaked?
KGF- chapter 2 kry scene video leaked?

య‌ష్ హీరోగా న‌టించిన చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`. సైలెంట్‌గా వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ వ‌సూళ్ల‌ని సాధించించింది. తొలి భాగం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో అందరి చూపు రెండ‌వ భాగం చాప్ట‌ర్ 2పై ప‌డింది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, య‌ష్ రెట్రోలుక్ అద‌రిపోవ‌డంతో సినిమా తొలి భాగానికి మించి ఉండ‌బోతోంద‌ని అర్థ‌మైపోయింది.

- Advertisement -

గ‌రుడ‌ని హ‌త్య చేసి న‌రాచిలో తన సామ్రాజ్యాన్ని రాఖీ ఎలా బిల్డ్ చేసుకున్నాడు?.. ఎలా న‌రాచీకి కింగ్‌గా మారాడ‌న్న అంశాల నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా రెండ‌వ పార్ట్‌ని రూపొందిస్తున్నారు. సంజ‌య్‌ద‌త్ అధీరాగా, ర‌వీనా టాండ‌న్ ర‌మికా సేన్‌గా న‌టిస్తున్న ఈ చిత్ర చివ‌రి షెడ్యూల్ మైసూర్‌లోని గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ సెంట‌ర్‌లో జ‌రుగుతోంది. గ్యాంగ్‌స్ట‌ర్ గెట‌ప్‌లో రెడ్ సూట్‌లో య‌ష్ న‌డుచుకుంటూ వెళుతున్న వీడియో ఒక‌టి లీక్ అయింది.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. మైసూర్‌లో కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించిన త‌రువాత ఫైన‌ల్ షూట్‌ని ఆర్ ఎఫ్ సీలో పూర్తి చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో కేజీఎఫ్ ఆన్ లొకేష‌న్‌కు సంబంధించిన వీడియో లీక్ కావ‌డం చిత్ర యూనిట్‌ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. దీనిపై చిత్ర వ‌ర్గాలు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All