
KGF చాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్‌గా రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన KGF 2 చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కన్నడ డబ్బింగ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని భారీ వసూళ్లు రాబట్టింది.
ఇక 5 వ రోజు కలెక్షన్స్ చూస్తే..
నైజాంలో 2.46 కోట్లు
సీడెడ్‌లో 74 లక్షలు
ఉత్తరాంధ్రలో 52 లక్షలు
తూర్పు గోదావరి జిల్లాలో 42 లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో 23 లక్షలు
గుంటూరు జిల్లాలో 28 లక్షలు
కృష్ణా జిల్లాలో 26 లక్షలు
నెల్లూరు జిల్లాలో 19 లక్షలు వసూలు చేసి.. 5.10 కోట్ల షేర్, 8.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తం 5 రోజులు కలెక్షన్స్ చూస్తే..58.66 కోట్లు షేర్, 93 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా చూస్తే..623.80 కోట్ల గ్రాస్‌ను, 311.15 కోట్ల షేర్‌ను రాబట్టింది.