Homeగాసిప్స్KGF 2 ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..?

KGF 2 ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..?

KGF 2 Movie OTT Release Date
KGF 2 Movie OTT Release Date

యశ్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘KGF Chapter 2’. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించింది. సెకండ్ పార్ట్ లో విలన్ అధీరాగా సంజయ్ దత్ నటించగా.. రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలలో నటించారు. నిన్న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని , భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ తరుణంలో ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ చిత్రం థియేట్రికల్ రన్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటిటి లో విడుదల అవుతుందని సమాచారం.మే 13 ఉదయం 12 గంటల నుంచి ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటనన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే.. నైజాంలో మొదటి రోజు రూ. 9.68 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా అక్కడ ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో ఐదో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ సాహో రూ. 9.41 కోట్లు, బాహుబలి 2 రూ. 8.90 కోట్లు, వకీల్ సాబ్ రూ. 8.75 కోట్లు రికార్డును దాటేసింది. ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ రూ. 23.35 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All