Homeటాప్ స్టోరీస్రాఖీ భాయ్ వచ్చేసాడు – కె.జి.ఎఫ్ 2 ఫస్ట్ లుక్ విడుదల

రాఖీ భాయ్ వచ్చేసాడు – కె.జి.ఎఫ్ 2 ఫస్ట్ లుక్ విడుదల

KGF 2 First look released
KGF 2 First look released

ఒక కన్నడ సినిమాగా మొదలై, చివరికి పాన్ ఇండియా లెవల్ గుర్తింపు తెచ్చుకుని, ఒక్కసారి అందరి దృష్టిని శాండిల్ వుడ్ వైపుకు తిప్పుకున్న సినిమా కె.జి.ఎఫ్. ఈ సినిమా తరువాత హీరో యష్ , డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటే తెలియని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. యావత్ ప్రపంచానికి పైశాచికత్వాన్ని, దురాశను, నేర్పించిన బంగారం అనే ఖనిజం మన దేశంలో ఎన్ని అరాచకాలకు కారణం అయ్యిందో ఈ సినిమాలో చూపించారు. కానీ అందరూ హీరో క్యారెక్టర్ ని బిల్డ్ చేసి, ఎలివేషన్ చేసిన తీరుకి మాత్రం ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ సినిమాకు రెండో పార్ట్ వస్తోంది. అసలు ఈ ఏడాది ఈ క్రిస్మస్ సీజన్ కి రావాల్సిన సినిమా, అనుకోని కారణాల వాళ్ళ వాయిదా పడి వచ్చే ఏడాది వేసవి కి థియేటర్ లలోకి రానుంది. ప్రస్తుతం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో “సామ్రాజ్యం పునర్నిర్మితం అవుతోంది.” అన్న లైన్ పోస్టర్ మీద ఉండగా, ఒక పెద్ద స్థంబాన్ని రాఖీ మరియు కెజిఎఫ్ కార్మికులు లాగుతున్న ఫోటో ఒకటి రిలీజ్ చేసారు.

· మొదటి భాగంలో గరుడను చంపిన రాఖీ కె.జి.ఎఫ్ ని ఎలా మొత్తం తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నాడు.?

- Advertisement -

· ఇండియా కి ఆశగా బయల్దేరిన ఇనాయత్ ఖలీల్ ; గరుడ స్థానంలోకి రావాలనుకున్న సుర్యవర్ధన్ తమ్ముడు అధీరాలు.. రాఖీ తో ఎలా యుద్ధం చేసారు.?

· గుంటనక్కల లాగా కాచుకుని కూర్చున్న శెట్టి, ఆండ్రూస్, రాజేంద్ర దేశాయ్ ఏం చేసారు.?

· అసలు కెజిఎఫ్ పైకి పెద్ద ఆర్మీని పంపి రాఖీని చంపేసి రమ్మన్న ఇందిరా గాంధీ అదేలే సారీ… సారీ ప్రధానమంత్రి రమికా సేన్ చివరకి ఏం చేసింది.?

· ఆనంద్ బాసిరాజు చెప్పినట్లుగా రాఖీకి సంబంధించిన ఆ వీర ప్రతిమ దొరికిందా.?

ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే కనీసం కె.జి.ఎఫ్ 2 ట్రైలర్ అయినా రిలీజ్ కావాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All