Homeటాప్ స్టోరీస్KGF 2 ఫస్ట్ డే కలెక్షన్స్

KGF 2 ఫస్ట్ డే కలెక్షన్స్

KGF 2 First day collections
KGF 2 First day collections

KGF చాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్‌గా రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన KGF 2 చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కన్నడ డబ్బింగ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని భారీ వసూళ్లు రాబట్టింది.

ఇండియా వైజ్ కలెక్షన్స్ చూస్తే..

- Advertisement -

నైజాంలో 9.68 కోట్లు
సీడెడ్‌లో 2.84 కోట్లు
ఉత్తరాంధ్రలో 1.70 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో 1.19 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో 84 లక్షలు
గుంటూరు జిల్లాలో 1.13 కోట్లు
కృష్ణా జిల్లాలో 90 లక్షలు
నెల్లూరు జిల్లాలో 81 లక్షలు వసూలు చేసి ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 19 కోట్ల షేర్, 31 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

హిందీ లో రూ. 53.95 కోట్లతో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. హిందీతోపాటు ఇతర రాష్ట్రాల్లో మొత్తంగా 64.8 కోట్లు రాబట్టింది. కర్ణాటకలోరూ. 23.20 కోట్లు, తమిళనాడులో 8.20 కోట్లు, కేరళలో 7.10 కోట్లు, ఓవర్సీస్‌లో 23.90 కోట్లు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా 134.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All