Homeటాప్ స్టోరీస్RRR రికార్డ్స్ ను బ్రేక్ చేసిన 'KGF Chapter 2'

RRR రికార్డ్స్ ను బ్రేక్ చేసిన ‘KGF Chapter 2’

KGF 2 breaks RRR records
KGF 2 breaks RRR records

‘KGF Chapter 1 తర్వాత రాకింగ్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రం ‘KGF Chapter 2’. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. సెకండ్ పార్ట్ లో విలన్ అధీరాగా సంజయ్ దత్ నటిస్తుండగా , రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలలో నటించడం తో సినిమా ఫై మరింత అంచనాలు పెరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ బాషలలో ఈ సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలైంది. ఈ మూవీ రిలీజ్ కు ముందే పలు రికార్డ్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు సినిమా సత్తాను చాటి చెప్పైనా బాహుబలి , ఆర్ఆర్ఆర్ చిత్రాలను వెనక్కు నెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ‘KGF Chapter 2’ మూవీ అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారానే రూ. 80.30 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా హవాను చూపించిన బాహుబలి , ఆర్ఆర్ఆర్ చిత్రాల అడ్వాన్స్ లను KGF 2 బ్రేక్ చేసినట్లు సమాచారం. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా ఎక్కువ వసూలు చేసిన చిత్రాల జాబితాలో KGF Chapter 2 (రూ. 80.30 కోట్లు) మొదటి స్థానంలో ఉండగా..రెండో స్థానంలో బాహుబలి (రూ. 80 కోట్లు), మూడో స్థానంలో హాలీవుడ్ మూవీ అవేంజర్స్ ఎండ్ గేమ్ (రూ. 60 కోట్లు) , నాల్గో స్థానంలో RRR (రూ. 58 కోట్లు) ఐదో స్థానంలో సాహో (రూ. 36 కోట్లు), ఆరో స్థానములో రోబో 2.0 (రూ. 35 కోట్లు) , ఏడో స్థానంలో వార్ (రూ. 32.50 కోట్లు) మూవీలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All