
అభిమానులు, సినీ ప్రేక్షకులు అనుకున్నట్లే బాహుబలి 2 రికార్డ్స్ ను కెజిఎఫ్ 2 బ్రేక్ చేసింది. యష్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ‘కేజీయఫ్: చాప్టర్ 2’ సినిమా నార్త్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ‘బాహుబలి 2’ రికార్డ్ ను బ్రేక్ చేయడమే కాదు.. వేగంగా రూ. 250 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా చరిత్రలోకి ఎక్కింది.
ఏప్రిల్ 14న విడుదలైన ‘KGF 2’ నార్త్ లో ఫస్ట్ డే రూ. 53.95 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు రూ. 46.79 కోట్లు , మూడో రోజు రూ. 42.90 కోట్లు , నాలుగో రోజు రూ. 50.35 కోట్లు , ఐదో రోజు 25.57 కోట్లు , ఆరో రోజు 19.14 కోట్లు , ఏడవ రోజు బుధవారం 16.35 కోట్లు రాబట్టి ఓవరాల్ గా ఈ వారంలో రూ. 255.05 కోట్లు కలెక్షన్స్ తో అగ్ర స్థానంలో నిలిచింది.
- Advertisement -