
యశ్ – ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన కెజియఫ్ 2 సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకొని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఇక నార్త్ లో అయితే కేవలం ఆరు రోజుల్లోనే రూ. 250 కోట్లు రాబట్టి సంచలనం రేపింది. వరల్డ్ వైడ్‌గా ఆరు రోజుల్లో 676.15 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేయగా.. 680 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టాలి. ఆరవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.12 కోట్ల షేర్.. (రూ. 52.35 కోట్ల) గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
యశ్ యాక్షన్ .. ప్రశాంత్ నీల్ టేకింగ్ ఆసక్తిని రేకెత్తించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..భారీ తారాగణం ఈ సినిమా ఈ స్థాయిలో విజయాన్ని సాధించడానికి కారణమని సినీ విశ్లేషకులు అంటున్నారు. సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించించిన ఈ సినిమాలో, శ్రీనిధి శెట్టి .. రవీనా టాండన్ .. ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.