
KGF చాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్‌గా రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన KGF 2 చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కన్నడ డబ్బింగ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని భారీ వసూళ్లు రాబట్టింది.
నాల్గు రోజుల కలెక్షన్స్ చూస్తే..
హిందీ వెర్షన్ ;-
తొలి రోజున 53.95 కోట్లు
రెండో రోజున 46.79 కోట్లు
మూడో రోజున 42.90 కోట్లు
నాలుగో రోజున 50.35 కోట్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం193.99 కోట్లు సాధించింది.
తమిళ్ వెర్షన్ :
తొలి రోజున 8.24 కోట్లు
రెండో రోజున 10.61 కోట్లు
మూడో రోజున 11.50 కోట్లు
నాలుగో రోజున 12.38 కోట్లు వసూలు చేసింది. దాంతో 42.73 కోట్లు వసూళ్లను నమోదు చేసింది.
తెలుగు వెర్షన్ :
తొలి రోజున 19.09 కోట్లు
రెండో రోజున 13.37 కోట్లు
మూడో రోజున 10.29 కోట్లు
నాలుగో రోజున 10.81 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 53.56 కోట్ల షేర్, 84.80 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం దేశ వ్యాప్తంగా 277.81 కోట్లు షేర్.. 550 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.