
KGF చాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్‌గా రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన KGF 2 చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కన్నడ డబ్బింగ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. నార్త్ , సౌత్ అనే తేడాలు లేకుండా పలు చిత్రాల రికార్డ్స్ ను బ్రేక్ చేసి సత్తా చాటుతుంది.
ఇక ఈ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ చూస్తే..
తెలుగు రాష్ట్రాలు (ఏపీ, తెలంగాణ) – రూ.102.60 కోట్లు
బాలీవుడ్ + రెస్టాఫ్ ఇండియా – రూ.300.60 కోట్లు
కర్ణాటక – రూ.115.30 కోట్లు
కేరళ – రూ.41.15 కోట్లు
ఓవర్ సీస్ – రూ.114.05 కోట్లు
తమిళనాడు రూ.45.60 కోట్లు
ఓవరాల్ గా రూ.719.30 కోట్లు గ్రాస్ ..357.01 కోట్లు షేర్ సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ రూ.102.60 కోట్లు కాగా, షేర్ వసూళ్లు రూ.64.51 కోట్లు. అంటే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 14 కోట్లు సాధించాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.