
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. నాన్ స్టాప్‌గా కొనసాగించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.
ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ తన 30 వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. `అల వైకుంఠపురములో` వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత త్రివిక్రమ్ నుంచి రానున్న మూవీ కావడం, `అరవింద సమేత` తరువాత పొలిటికల్ నేపథ్యంలో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై సహజంగానే బారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇందులో మరోసారి పూజా హెగ్డేని రిపీట్ చేయడం ఇష్టం లేని త్రివిక్రమ్ .. కీర్తిసురేష్‌ని తీసుకోవాలని భావిస్తున్నారట. మరో హీరోయిన్ కోసం కేతిక శర్మని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవలే త్రివిక్రమ్‌ని కేతిక శర్మ కలిసిందట. సినిమాకు గ్లామర్ డోస్ అవసం కాబట్టి సెకండ్ హీరోయిన్ గా కేతికని ఫైనల్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. కేతిక శర్మ పూరి తనయుడు ఆకాష్ నటిస్తున్న `రొమాంటిక్` మూవీతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.