
కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మహాళా ప్రధాన చిత్రం `గుడ్ లక్ సఖీ`. ఈ చిత్రానికి అత్యధిక శాతం మహిళలే కీలక శాఖల్ని నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమవుతోంది. శ్రావ్యా వర్మ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ఈ చిత్ర టీజర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేస్తోంది. ఉదయం 10 గంటకు టీజర్‌ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇటివల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కీర్తి సురేష్ గ్రామీణ యువతిగా కనిపించి ఆకట్టుకుంది.
స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే రోమ్ కామ్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించబోతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఓ మైనర్ షెడ్యూల్ మినహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.