Homeటాప్ స్టోరీస్మహేష్ సరసన కళావతిగా కనిపించనున్న కీర్తి

మహేష్ సరసన కళావతిగా కనిపించనున్న కీర్తి

మహేష్ సరసన కళావతిగా కనిపించనున్న కీర్తి
మహేష్ సరసన కళావతిగా కనిపించనున్న కీర్తి

సూపర్ స్టార్ మహేష్ బాబు హంగామాతో నిన్న సోషల్ మీడియా అంతా నిండిపోయింది. ముఖ్యంగా సర్కారు వారి పాట టీజర్ తో మోత మోగిపోయింది. మహేష్ లుక్స్, మ్యానరిజమ్స్ అన్నీ హైలైట్ గా ఉన్నాయి. వీటికి తోడు మహేష్, కీర్తి సురేష్ ల మధ్య క్యూట్ రొమాన్స్ కూడా బాగా వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది.

ఇక కీర్తి సురేష్ ఈ చిత్రంలో కళావతి పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని మహేష్ బాబు ట్విట్టర్ లో రివీల్ చేసాడు. కీర్తి సురేష్, మహేష్ కు విష్ చేయగా థాంక్యూ కళావతి అని రిప్లై ఇచ్చాడు మహేష్. పరశురామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జనవరి 13న సర్కారు వారి పాట చిత్రం విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

- Advertisement -

ఇక కీర్తి సురేష్ ఈ చిత్రం కాకుండా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All