Homeటాప్ స్టోరీస్కీర్తిసురేష్ కొత్త లుక్ వ‌చ్చేసింది!

కీర్తిసురేష్ కొత్త లుక్ వ‌చ్చేసింది!

Keerthy suresh stunning look in mohanlal film
Keerthy suresh stunning look in mohanlal film

`మ‌హాన‌టి` త‌రువాత కీర్తిసురేష్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. న‌ట‌న‌కు ప్రాధాన్య‌త వున్న పాత్ర‌ల్లో మాత్ర‌మే న‌టిస్తూ వ‌స్తోంది. `మిస్ ఇండియా`, పెంగ్విన్‌, రంగ్ దేతో పాటు ప‌లు కీల‌క చిత్రాల్లో న‌టిస్తున్నకీర్తిసురేష్ మ‌ల‌యాళంలోనూ ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తోంది. మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తున్న న‌టిస్తున్న తాజా చిత్రం `మ‌ర‌క్కార్ అర‌బిడ‌క‌డ‌లైంట్ సింగం`. ప్రియ‌ద‌ర్శ‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అరేబియ‌న్ సముద్రం నేప‌థ్యంలో అత్యంత భారీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే వున్నాయి. టీజర్ గ్రాండీయ‌ర్‌గా వుండ‌టంతో సినిమా ఓ రేంజ్లో వుండే అవ‌కాశం వుంద‌ని మ‌ల‌యాళ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో కీర్తిసురేష్ మ‌ల‌యాళ యువ‌తిగా న‌టిస్తోంది. తాజాగా కీర్తిసురేష్‌కు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

- Advertisement -

మ‌ల‌యాళీ యువ‌తిగా కీర్తి లుక్ ఆక‌ట్టుకుంటోంది. వైట్ సారీలో మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ‌గా క‌నిపిస్తున్న కీర్తి లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. మంజు వారియ‌ర్‌, సునీల్‌శెట్టి, అర్జున్‌, ప్ర‌భు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు, వంద కోట్ల‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 26న రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు ఆంటోని పెరుంబూవ‌ర్‌, సంతోష్ టి. కురువిల్లా ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All