
నటిగా విమర్శలు ఎదుర్కొన్న కీర్తి సురేష్ `మహానటి` తరువాత విమర్శకుల్ని సైతం ఆశ్చర్యపరిచి మహానటి అనిపించుకుంది. ఈ సినిమా తరువాత నుంచి కీర్తి సురేష్ స్టార్ డమ్ మారిపోయింది. తన పాత్రకు ప్రాధాన్యత వున్న చిత్రాల్లో మాత్రమే నటించడం మొదలుపెట్టింది. ఇటీవల కీర్తి నటించిన `పెంగ్విన్` ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే కీర్తి సురేష్ తనకు వచ్చిన మొదటి లవ్ లెటర్ గురించి బయటపెట్టింది.
అంతే కాదండోయ్ తన ఫస్ట్ లవ్ లెటర్‌ని భద్రంగా దాచుకుందట. అయితే ఆ లవ్ లెటర్ కాలేజీ రోజుల్లో తనకు రాలేదని, ఓ అభిమాని ఇచ్చాడని షాకిచ్చింది. `ఓ సారి ఓ గోల్డ్ షూరూమ్ ఓపెనింగ్‌కి వెళితే అక్కడొక అభిమాని నా దగ్గరికి వచ్చి ఓ బహుమతి ఇచ్చి వెళ్లాడు. అందులో నా ఫొటోలన్నింటినీ ఆల్బమ్‌ల తయారు చేశాడు. అందులో ఓ లెటర్ కూడా వుంది. తెరిచి చూసి షాకయ్యాను. అందులో అతను నన్ను ప్రపోజ్ చేశాడు. ఆ లెటర్‌ని ఇప్పటికి భద్రంగా దాచుకున్నాను` అని షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది కీర్తి సురేష్.
కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.