
కీర్తి సురేష్ తెలుగులో స్టార్ హీరోయిన్ స్థానాన్ని దక్కించుకున్నా ఇప్పటికీ ఆమె తెలుగులో నటించిన తొలి చిత్రం విడుదలకు నోచుకోవడం లేదు. సీనియర్ నరేష్ తనయుడు విజయ్‌కృష్ణ నవీన్‌ని హీరోగా పరిచయం చేస్తూ చంటీ అడ్డాల ఓ చిత్రాన్ని ప్రారంభించారు. `జానకితో నేను` అనే టైటిల్ ని అనుకున్నారు. తనయుడి తొలి సినిమా కావడంతో నరేష్ కూడా ముందుకొచ్చి ఈ మూవీ గురించి ప్రచారం చేశారు.
కొంత కాలం ఈ మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తరువాత ఈ మూవీకి `అయినా ఇష్టం నువ్వు` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. తరువాతే సీన్ మారింది నిర్మాతా మారాడు. చంటి అడ్డాల ప్లేస్‌లో నట్టికుమార్ వచ్చారు. చేతులు మారిన ఈ మూవీ రిలీజ్ కు ఆపసోపాలు పడుతోంది. తాజాగా ఈ చిత్రానికి `రెండు జడల సీత` అనే టైటిల్‌ని అనుకుంటున్నారట.
`మహానటి` తరువాత కీర్తిసురేష్‌కు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఏర్పడటంతో ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని నట్టికుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూవీని తను ఎవరికీ ఇవ్వలేదని చంటీ అడ్డాల వాదిస్తుంటే నట్టికుమార్ మాత్రం తనకు అమ్మేశారని సాక్ష్యాలు చూపిస్తున్నారు. పోలీస్టేషన్ వరకు వెళ్లిన ఈ పంచాయితీ ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.