
తమిళ యువ సంగీత సంచలనం అనిరుధ్. ధనుష్ వై దిస్ కొలవెరితో వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ని సంతం చేసుకున్న అనిరుధ్ ఆ మధ్య హీరోయిన్ ఆండ్రియాతో లిప్‌లాక్ చేసి సంచలనం సృష్టించాడు. తెలుగు, తమిళ భాషల్లో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీటగా గడిపేస్తున్న అనిరుధ్ శుక్రవారం రాత్రి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌తో కలిసి బర్త్‌డే పార్టీ చేసుకున్నారు.
శుక్రవారం అనిరుధ్ పుట్టిన రోజు. విశేషం ఏంటంటే శనివారం కీర్తి సురేష్ పుట్టిన రోజు. దీంతో శుక్రవారం రాత్రి అనిరుధ్‌కు కీర్తి సురేష్ స్పెషల్ బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పింది. శనివారం కీర్తి బర్త్‌డే కావడంతో ఈ ఇద్దరూ లాస్ట్ నైట్ బర్త్‌డే ని సెలబ్రేట్ చేసుకున్నారు. పార్టీలో అత్యంత సన్నిహితంగా వున్న వీరి ఫొటోల్ని కీర్తి సురేష్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో కీర్తి, అనిరుధ్ క్లోజ్ ఫ్రెండ్స్‌లా కనిపించడం.. ఒకరిని ఒకరు విష్ చేసుకోవడం పలువురిని ఆకట్టుకుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం నిలిన్‌తో రంగ్ దే`మిస్ ఇండియా , గుడ్ లక్ సఖి, మరక్కార్ , అన్నాతే వంటి చిత్రాల్లో నటిస్తోంది. కీర్తి సురేష్ నటిస్తున్న `మిస్ ఇండియా` నెట్ ఫ్లిక్స్‌లో డైరెక్ట్ రిలీజ్ కాబోతోంది.
Happy birthday dear @anirudhofficial ? ♥️
May you have an amazing year ahead!! ?
You better wish me back in a few hours ?#HBDRockstarAnirudh pic.twitter.com/WJnx7tGpaJ
— Keerthy Suresh (@KeerthyOfficial) October 16, 2020