Homeఎక్స్ క్లూసివ్కీరవాణి రిజెక్ట్ చేసిన బయోపిక్ అదేనా !

కీరవాణి రిజెక్ట్ చేసిన బయోపిక్ అదేనా !

Keeravani rejected another biopic
M.M.Keeravani

సంగీత దర్శకుడిగా కీరవాణికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఉన్న విషయం తెలిసిందే . ఇక బాహుబలి సిరీస్ ల సినిమాలతో కీరవాణి రేంజ్ కూడా అనూహ్యంగా పెరిగింది అయితే కీరవాణి రేంజ్ ఎంతగా పెరిగినా ఈమధ్య కాలంలో మాత్రం బయటి సినిమాలకు పెద్దగా సంగీతం అందించడం లేదు ,కొన్ని ప్రత్యేకమైన సినిమాలకు తప్ప . తాజాగా కీరవాణి సంగీతం అందించిన చిత్రం ” ఎన్టీఆర్ బయోపిక్ ‘ అయితే ఈ సినిమా కాకుండా మరో బయోపిక్ కు సంగీతం అందించాలని ఓ దర్శకుడు కీరవాణి ని కలిశాడట ! కానీ ఆ సినిమా చేయనని దండం పెట్టాడట ఇప్పుడు అదే పెద్ద టాపిక్ అయి కూర్చుంది .

ఇంతకీ కీరవాణి రిజెక్ట్ చేసిన బయోపిక్ ఏది ? అన్న చర్చ జరుగుతోంది . టాలీవుడ్ లో ఇప్పుడు మరికొన్ని బయోపిక్ లు షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే . అందులో కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర ఒకటి . ఈ యాత్ర సినిమానే కీరవాణి రిజెక్ట్ చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి . వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అర్దాంతరంగా చనిపోయిన విషయం తెలిసిందే . ఎన్టీఆర్ తర్వాత ప్రజారంజకమైన పరిపాలన అందించిన వాళ్లలో అగ్రగణ్యుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి . అయితే ముగింపు మరోలా ప్లాన్ చేయడంతో ఓ బయోపిక్ చేయనని చెప్పానని అన్నాడు కీరవాణి . అయితే సినిమా పేరు చెప్పలేదు కానీ తెలుగువారి ఆరాధ్యనీయుడు అని చెప్పాడు కదా ! ఎన్టీఆర్ తర్వాత వై ఎస్ మాత్రమే పరిపాలకుడిగా ముద్ర వేసుకున్నాడు మరి .

- Advertisement -

English Title: Keeravani rejected another biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All