Homeఎక్స్ క్లూసివ్కేసీఆర్ ప్రభంజనం

కేసీఆర్ ప్రభంజనం

 KCR's Wave
KCR

తెలంగాణ లో కేసీఆర్ ప్రభంజనం సృష్టించాడు . ఎగ్జిట్ పోల్స్ ని తలదన్నేలా , లగడపాటి రాజగోపాల్ సర్వేని తల్లకిందులు చేస్తూ ప్రభంజనం సృష్టించాడు . తెలంగాణలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది . దాదాపు 90 స్థానాల దిశగా దూసుకుపోతోంది కారు . కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు , వితంతు పెన్షన్ లు , వృద్ధ్యాప్య పెన్షన్ లు , వికలాంగుల పెన్షన్ లు ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని పనులు  కేసీఆర్ కు కలిసి వచ్చాయి .

తెలంగాణలో కేసీఆర్ ఏకఛత్రాదిపత్యం ని మరోసారి చాటిచెప్పింది , తెలంగాణ రాష్ట్రం సిద్దించాక మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేసాయి అంతేకాదు , పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని ప్రచారం చేసాయి కానీ ప్రతిపక్షాలు చేసిన విమర్శలన్నీ కేసీఆర్ హవాలో కొట్టుకుపోయాయి . మొత్తానికి వార్ వన్ సైడ్ అయిపొయింది తెలంగాణలో . మొదటిసారి కంటే ఇప్పుడు ఎక్కువ మెజారిటీ రావడంతో టీఆర్ఎస్ శ్రేణుల సంతోషానికి అంతేలేకుండా పోయింది .

- Advertisement -

English Title: KCR’s Wave

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All