Homeటాప్ స్టోరీస్కేసిఆర్ యాగం ఎందుకు చేస్తున్నట్లు ?

కేసిఆర్ యాగం ఎందుకు చేస్తున్నట్లు ?

KCR performs rajashyamala yagam for power politicsయాగాలు అన్నా , ముహూర్తాలు చూసుకొని కార్యక్రమాలు ప్రారంభించాలన్నా అది కేసిఆర్ కే చెల్లింది . ముఖ్యమంత్రిగా ఆయుత చండీయాగం చేసి సంచలనం సృష్టించిన కేసిఆర్ తాజాగా మరోసారి రాజశ్యామల యాగానికి సిద్దమయ్యాడు . అయితే అనూహ్యంగా ఇప్పుడు రాజశ్యామల యాగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే తెలంగాణలో ఎన్నికలు జరుగబోతున్నాయి , మొన్నటి వరకు గెలుపు మాదే …… వంద కు పైగా సీట్లు సాధించబోతున్నాం అంటూ ప్రగల్భాలు పలికారు కట్ చేస్తే మహా కూటమి వల్ల కేసిఆర్ వెన్నులో వణుకు మొదలైంది అందుకే మరో యాగానికి సిద్దమయ్యాడు కేసిఆర్ అని వినిపిస్తోంది . ముహూర్త బలం చూసుకొని అసెంబ్లీ ని రద్దు చేసాడు , ముహూర్త బలం చూసుకొనే నామినేషన్ వేసాడు కానీ ఎక్కడో ఇంకా అనుమానం అందుకే ఈ యాగం అని అంటున్నారు .

తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనీ గట్టి ప్రయత్నమే చేసాడు కానీ అనూహ్యంగా బద్ద శత్రువులైన కాంగ్రెస్ – టిడిపి లు కలవడంతో కేసిఆర్ వెన్నులో వణుకు మొదలయ్యింది . ఓటమి భయం పట్టుకుంది అందుకే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడి ని అదేపనిగా విమర్శిస్తున్నాడు . కేసిఆర్ మాత్రమే కాదు కేటిఆర్ , హరీష్ రావు , కవిత లతో పాటుగా టిఆర్ఎస్ నాయకులు కూడా చంద్రబాబు ని బూచిగా చూపిస్తూ విమర్శలు చేస్తున్నారు . ఇంటలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అత్యధిక స్థానాల్లో టిఆర్ ఎస్ ఓడిపోబోతోంది , మహా కూటమి ఘన విజయం సాధించబోతోందట . దాంతో ఓటమి భయం పట్టుకున్న కేసిఆర్ ఇలా యాగాలు చేస్తూ చంద్రబాబు ని విమర్శిస్తూ ఓటర్లని ప్రలోభ పెట్టడానికి చూస్తున్నాడు .

- Advertisement -

English Title: KCR performs rajashyamala yagam for power politics

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All