Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ బయోపిక్ కు షాక్ ఇచ్చిన కేసీఆర్

ఎన్టీఆర్ బయోపిక్ కు షాక్ ఇచ్చిన కేసీఆర్

KCR gives shock to NTR biopicఎన్టీఆర్ కథానాయకుడు రేపు విడుదల అవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ షోలకు పర్మీషన్ ఇచ్చింది . ఆమేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం , అయితే తెలంగాణ లో మాత్రం మొండిచేయి చూపింది కేసీఆర్ ప్రభుత్వం . కాకపోతే ఒక్క భ్రమరాంబ థియేటర్ లో మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర యూనిట్ స్పెషల్ షోకు పర్మిషన్ లభించింది , దాంతో బాలయ్య తో పాటుగా ఆ చిత్ర బృందం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాని చూడనున్నారు .

రెగ్యులర్ గా నాలుగు షోలు ఎక్కడైనా అయితే ఆంధ్రప్రదేశ్ లో అనుమతి లభించింది కాబట్టి మొదటివారం రోజులు ప్రతీ రోజు కూడా 6 షోలు పడనున్నాయి . తెలంగాణలో మాత్రం నాలుగు షోలు మాత్రమే పడనున్నాయి , బాలయ్య కు కేసీఆర్ షాక్ ఇచ్చాడు ఈ రూపంలో . ఇందులో రాజకీయ నిర్ణయం అంటూ ఏమిలేదు కానీ గతకొంత కాలంగా స్పెషల్ షోలకు తెలంగాణాలో అంతగా పర్మీషన్ ఇవ్వడం లేదు మరి .

- Advertisement -

English Title: KCR gives shock to NTR biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All