Homeటాప్ స్టోరీస్కేసీఆర్ ప్రభుత్వం స్టూడియో స్థలాలను తీసుకోనున్నారా

కేసీఆర్ ప్రభుత్వం స్టూడియో స్థలాలను తీసుకోనున్నారా

kcr eyes on film nagar studiosతెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సినిమా స్టూడియో లకు ఇచ్చిన స్థలాలను కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోనున్నారా ? అంటే నిజమే నేమో అన్న అనుమానం తలెత్తుతోంది ఎందుకంటే కొంతమంది స్టూడియో అధినేతలతో ప్రభత్వం స్థలాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది . ఇప్పుడున్న స్టూడియో లు అన్నీ హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్నాయి దాంతో ఆ స్థలాలు ప్రభుత్వానికి ఇస్తే వాటికి బదులుగా హైదరాబాద్ శివారులో సకల సౌకర్యాలతో స్టూడియోలను తిరిగి నిర్మించి ఇస్తామని ప్రతిపాదన పెట్టారట .

అయితే ప్రభుత్వ ప్రతిపాదన కు ఒక్క స్టూడియో అధినేత కూడా ఒప్పుకోలేదట ! స్టూడియో లను ఇవ్వడానికి అందరు కూడా ముక్త కంఠంతో నిరాకరించారట ! ఇక ఇంతకుముందే కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టూడియో లను నిర్మించాలని ప్రయత్నాలు చేసారు ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి సొంత రాష్ట్రంలో తప్పకుండా స్టూడియో ఉండాలని భావిస్తున్నారు సదరు స్టూడియో అధినేతలు . అయితే ప్రభుత్వం సూచన ప్రాయంగా ప్రతిపాదన మాత్రమే తెచ్చిందట అంతేకాని స్థలాలను పూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశ్యం మాత్రం కాదట !

- Advertisement -

English Title: kcr eyes on film nagar studios

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All