Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్తెలంగాణ మంత్రివర్గ విస్తరణ!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ!

- Advertisement -

త్వరలోనే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చోటు చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది . మంత్రివర్గంలో ఈసారి హరీష్ రావు కు అలాగే కేటీఆర్ కు స్థానం కల్పించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ . ఈ ఇద్దరితో పాటుగా చేవెళ్ల చెల్లమ్మ గా పేరుగాంచిన సబితా ఇంద్రారెడ్డి కు కూడా మంత్రివర్గంలో ఛాన్స్ లభించడం ఖాయమని తెలుస్తోంది .

కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచింది సబితా ఇంద్రారెడ్డి అయితే ఇటీవలే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసినట్లుగా ప్రకటించడంతో కాంగ్రెస్ నుండి ఎన్నికైన వాళ్ళు టీఆర్ఎస్ సభ్యులుగానే పరిగణించనున్నారు స్పీకర్ . సబితా ఇంద్రారెడ్డి తో పాటుగా వనమా వెంకటేశ్వర్ రావు లేదా గండ్ర వెంకట రమణారెడ్డి లలో ఎవరో ఒకరికి మంత్రి పదవి లభించడం ఖాయమని తెలుస్తోంది . కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీ సాధించడంతో కేటీఆర్ , హరీష్ రావు లను కేబినెట్ లోకి తీసుకుంటున్నాడు కేసీఆర్ .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts