Saturday, October 1, 2022
Homeటాప్ స్టోరీస్స్ఫూ ర్తి నింపేలా కౌసల్య కృష్ణమూర్తి ట్రైలర్...

స్ఫూ ర్తి నింపేలా కౌసల్య కృష్ణమూర్తి ట్రైలర్…

 Kaushalya Krishnamurthy Telugu Movie Trailer Release
కౌసల్య కృష్ణమూర్తి ట్రైలర్

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌‘. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ ‘యు’ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఆగష్టు 19 న విడుదల చేశారు. ఒక అమ్మాయి ఇండియా తరఫున క్రికెటర్ గా ఆడాలన్న తన కల కోసం పడ్డ తపన, కష్టం ప్రతిబింబించేలా ట్రైలర్ సాగింది. చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, బ్యూటీ క్వీన్ రాశీ ఖన్నా ముఖ్య అతిధులుగా మంగళవారం (ఆగష్టు 20న) జె ఆర్ సి బాల్ రూమ్, హైదరాబాద్ నందు జరుగనుంది.
ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
తన తండ్రి ని సంతోషపెట్టడానికి క్రికెటర్ అవుతానని ఒక చిన్న పాప చెప్పే డైలాగ్ తో మొదలయ్యే ట్రైలర్ ‘ గవాస్కర్, సచిన్ క్రికెట్ లోకి కొడుకుల్ని పంపించారు తప్ప కూతుర్లని పంపించలేదు కదా..’, ‘ మగపిల్లలతో కలిసి మగరాయుడు లాగా బ్యాట్ ఆట ఆడతావే..’ లాంటి డైలాగులు అమ్మాయిలు క్రికెట్ ఆడటం పట్ల అదీ పల్లెటూళ్లలో ఎలాంటి వైఖరితో ఉంటారో చెప్తుంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ క్రికెట్ ని ప్రేమించే రైతు కృష్ణమూర్తి గా, క్రికెటర్ అవ్వాలని పరితపించే ఆయన కూతురు కౌసల్య గా ఐశ్వర్య రాజేష్ నటన, స్ట్రైకింగ్ డైలాగ్స్ హైలైట్ గా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగుతుంది. ‘నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్ళని కాదు… నిన్ను’, ‘ ఈ లోకం గెలుస్తానని చెప్తే వినదు.. కానీ గెలిచినా వాళ్ళు చెప్తే వింటుంది. నువ్వు ఎం చెప్పినా గెలిచి చెప్పు…’ అని శివ కార్తికేయన్ చెప్పే డైలాగులు స్ఫూ ర్తి నింపేలా ఉన్నాయి. క్రికెటర్ పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఎంత గొప్పగా నటించిందో ట్రైలర్ లోనే తెలిసిపోతుంది. కనువిందైన విజువల్స్ తో, మంచి ఎమోషన్స్, ఇన్స్పిరింగ్ గా సాగే కౌసల్య కృష్ణమూర్తి ట్రైలర్ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనేలా సాగింది.

- Advertisement -

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌(స్పెషల్‌ రోల్‌), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, ‘రంగస్థలం’ మహేశ్‌, విష్ణు(టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్‌, కథ: అరుణ్‌రాజ కామరాజ్‌, మాటలు: హనుమాన్‌ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, క ష్ణ కాంత్‌ (కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌, డాన్స్‌: శేఖర్‌, భాను, ఆర్ట్‌: ఎస్‌.శివయ్య, కో-డైరెక్టర్‌: బి.సుబ్బారావు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts