
గత ఆరు నెలలుగా కరోనా వైరస్ ప్రభావం తగ్గిందని లాక్‌డౌన్‌ని క్రమ క్రమంగా ఎత్తివేస్తూ వచ్చిన ప్రభుత్వం కీలక సంస్థలకి శరతులతో కూడిన అనుమతలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సిఈన పరిశ్రమ ఒకటి. గత ఏడాది కాలంగా కోవిడ్ కారణంగా సినీ పరిశ్రమ కుదేలైపోయింది. వందల కోట్ల నష్టాలని చవిచూసింది. అయితే గడిచిన ఆరు నెలలుగా అంటే గత నవంబర్ నుంచి షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా వున్న సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది.
దీంతో మళ్లీ షూటింగ్‌ల కలకల మొదలైంది. ఇక థియేటర్లలకు కూడా అనుమతులు ఇవ్వడంతో సినిమా రిలీజ్‌లు కూడా రికార్డు స్థాయిలో జరగడం మొదలైంది. అంతా బాగానే వుంది అనుకుంటున్న తరుణంలో సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి మళ్లీ దేశాన్ని పట్టి పీడించడం మొదలుపెట్టింది. మహారాష్ట్రలో మరీ ముఖ్యంగా ముంబై మహానగరంలో కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
ఇదిలా వుంటే బాలీవుడ్‌ని కోవిడ్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇటీవల వరుసగా స్టార్స్ కోవిడ్ బారిన పడుతున్నారు. పరేష్ రావల్, రణ్‌బీర్ కపూర్ ఆ తరువాత అలియాభట్ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇటీవల అక్షయ్‌కుమార్‌తో పాటు ఆయనతో కలిసి పనిచేసిన యూనిట్ సిబ్బంది దాదాపు 30 మందికి కూడా కరోనా సోకింది. తాజాగా హాట్ గాళ్ కత్రినా కైఫ్ కూడా దీని బారిన పడినట్టు తెలిసింది. ఇటీవల తన సోదరి ఇజమెల్లాతో కలిసి బాంద్రాలోని ఓ హోటల్‌లో డిన్నర్‌కి వెళ్లిన కత్రిన కోవిడ్ బారిన పడినట్టు తెలిసింది. దీంతో కరోనా బారిన పడుతున్న బాలీవుడ్ సెలబ్రిటీల జాబితా రోజు రోజుకూ పెరిగిపోతూనే వుంది.