
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. రోజు రోజుకీ ఈ రౌడీ హీరో ఫ్యాన్స్ లిస్ట్ క్రేజీగా పెరిగిపోతోంది. సాధారణ ఫ్యాన్స్ పెరగడం వేరు.. సెలబ్రిటీ ఫ్యాన్స్ పెరగడం వేరు. విజయ్ దేవరకొండకు సాధారణ సాధారణ ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీ ఫ్యాన్స్ లిస్ట్ కూడా పెరిగిపోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, సాండల్‌వుడ్ క్రేజీ నటులు, క్రేజీ హీరోయిన్‌లు ఇప్పటికే విజయ్ దేవరకొండ ని అమితంగా అభిమానించే లిస్ట్‌లో చేరారు. తాజాగా ఈ లిస్ట్‌లో కోలీవుడ్ వివాదాస్పద నటి కాస్తూరి చేరింది.
ఓ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ గురించి అడిగితే అతనంటే పిచ్చి అని టక్కున చెప్పేసి షాకిచ్చింది. విజయ్ దేవరకండ ఎప్పుడు ఎలా వుంటాడో వర్ణించి ఆశ్చర్యపరిచింది. ఈ మాటలు వింటే నిజంగా విజయ్ దేవరకొండ కూడా షాక్‌కు గురి కావడం ఖాయం. అంతలా ఆయనని వర్ణించింది. అతనితో కలిసి నటించ అవకాశం వస్తే తల్లి పాత్రలో మాత్రం అస్సలు నటించనని, అతనికి ప్రేయసిగా నటించడానికే ప్రాధాన్యత నిస్తానని స్పష్టం చేసింది.
విజయ్ అంటే తనకు క్రష్ వుందని, అతను పర్‌ఫెక్ట్ హీరో అని, ఓపెన్‌గా చెప్పాలంటే విజయ్ దేవరకొండ హాట్ అని చెప్పేసింది. తను ఎలా వున్నా బాగుంటాడని, షర్ట్ వున్నా, లేకున్నా, చింపిరి జుట్టుతో వున్నా.. క్రాఫ్ నీట్ వున్నా బాగుంటాడని, అతనో ఇటాలియన్ సూపర్ మోడల్‌లా వుంటాడని మురిసిపోయింది కస్టూరి. ఈ మాటలపై విజయ్ దేవరకొండ ఏమంటారో.