Homeటాప్ స్టోరీస్ప్రేమలో మునిగి తేలుతున్న స్టార్ హీరో కూతురు!!

ప్రేమలో మునిగి తేలుతున్న స్టార్ హీరో కూతురు!!

Kartik Aaryan love with Sara Ali Khan
Kartik Aaryan love with Sara Ali Khan

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ గారాల పట్టీ సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ జంట ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తొలిసారి కలిసి నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో రణదీప్ హుడా కీలకపాత్ర పోషిస్తున్నారు. సారా-కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నట్లు కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. రీసెంట్ గా ఓ టాక్ షోలో కూడా సారా.. తనకు కార్తీక్ ఆర్యన్ మీద క్రష్ ఉందని వెల్లడించిన విషయం అందరికి తెలిసిందే..! ఆ తర్వాత ఇద్దరూ ఇంతియాజ్ అలీ రూపొందిస్తున్న సినిమాలో నటిస్తుండటం, వారిరువురు .. బైక్ లపై చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుండటంతో వీరిద్దరి మధ్య ప్రేమ పరాకాష్టకు చేరిందని బాలీవుడ్లో రూమర్లు వినిపిస్తున్నాయి. ప్రేమ అనే అంశం తర్వాత ఎవరి జీవితంలో అయినా ప్రస్తావనకు వచ్చే పెళ్లి అంశమే. ఇక ఎవరి జీవితంలో ఏది ఎప్పుడు జరుగాలో అప్పుడు జగుతుంది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటున్నారట కుటుంబ సభ్యులు. మరి వీరి ప్రేమ వ్యవహారం ఇంతకీ పెళ్లి వరకు వెలుతుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి… !!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All