Homeటాప్ స్టోరీస్అన్నయ్యను వాడి.. తమ్ముడిని వాడలేదేంటి?

అన్నయ్యను వాడి.. తమ్ముడిని వాడలేదేంటి?

అన్నయ్యను వాడి.. తమ్ముడిని వాడలేదేంటి?
అన్నయ్యను వాడి.. తమ్ముడిని వాడలేదేంటి?

తమిళ హీరో కార్తీకి ఎప్పుడూ కమర్షియల్ చిత్రాలకంటే ప్రయోగాత్మక చిత్రాలే ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. కెరీర్ మొదట్లో చేసిన యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఈ మధ్య వచ్చిన ఖాకీ, ఖైదీ చిత్రాలు కార్తీని మంచి నటుడిగా నిలబెట్టాయి. తెలుగులో కార్తీకి ఫ్యాన్స్ పెరగడానికి కూడా కారణం ఇదే. కెరీర్ మొదట్లోనే మంచి ఊపుతో తెలుగులో వరస హిట్స్ కొట్టాడు కార్తీ. అయితే అనుకోకుండా కథల ఎంపికలో జరిగిన పొరపాట్ల వల్ల తన కెరీర్ ఇక్కడ డౌన్ అయింది. మధ్యలో ఖాకీ మంచి సినిమా అనిపించుకున్నా కూడా వసూళ్లు అంతంతమాత్రంగానే వచ్చాయి. కానీ ఖైదీతో పరిస్థితి మారింది. ఈ చిత్రం అటు విమర్శకుల ప్రశంసలను ఇటు కలెక్షన్లను సాధించింది. కొత్తగా ఉంటూనే అందరినీ ఆకట్టుకోవడంతో ఖైదీ కార్తీ కెరీర్ లో తొలిసారి 100 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాదాపు 5 కోట్ల బిజినెస్ జరిగిన ఈ చిత్రం ఏకంగా 15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందంటే ఎంత పెద్ద హిట్టో అర్ధం చేసుకోవచ్చు. కార్తీకి నటుడిగా కూడా పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రం ఖైదీ.

ఇదిలా ఉంటే ఖైదీ ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తుంటే కార్తీ అప్పుడే తన తర్వాతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈసారి ఒక్కడూ రావట్లేదు. తోడుగా తన వదిన జ్యోతికను కూడా తెచ్చుకుంటున్నాడు. కార్తీ నటిస్తున్న తర్వాతి చిత్రంలో జ్యోతిక కీలక పాత్రను పోషిస్తోంది. ఇందులో ఇద్దరూ అక్క, తమ్ముడిగా నటించారని అంటున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ నిన్న రాత్రి విడుదలైంది. తమిళంలో ఈ చిత్రానికి తంబీ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేయడంతో తెలుగులో తమ్ముడు అనే టైటిల్ పెడతారని అనుకున్నారంతా. ఖైదీ చిత్రంతో చిరంజీవి క్లాసిక్ మూవీ టైటిల్ ను వాడుకున్న కార్తీ ఈసారి తమ్ముడు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ వాడబోతున్నాడని తెలుగు మీడియా కథనాలు కూడా ప్రచురించింది.

- Advertisement -

అయితే కార్తీ ఈ చిత్రానికి తెలుగులో దొంగ అనే టైటిల్ ను ప్రకటించాడు. ఇది కూడా చిరంజీవే టైటిల్ కావడం విశేషం. అయితే తంబీ అన్నప్పుడు తమ్ముడు టైటిల్ పెట్టి ఉంటే పెర్ఫెక్ట్ గా ఉండేది కానీ ఎందుకో దొంగ అనే టైటిల్ కు వెళ్లారు. బహుశా మాస్ అప్పీల్ ఉండాలని అలా చేశారేమో. పోస్టర్ చూస్తుంటే ఇది దొంగ, పోలీస్ మధ్య దోబూచులాట కథలా అనిపిస్తోంది. దృశ్యం సినిమాను మలయాళంలో తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదలవుతుందని కార్తీ ప్రకటించాడు. మరి క్రిస్మస్ కు తెలుగులో రెండు చిత్రాలు ఆల్రెడీ షెడ్యూల్ అయి ఉండడంతో ఎప్పుడు విడుదలవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జ్యోతిక కూడా ఈ మధ్య మంచి ఫామ్ లో ఉంది. వరసగా ఝాన్సీ, జాక్ పాట్ వంటి సినిమాలతో సూపర్ హిట్స్ సాధించింది. మరి ఈసారి ఇద్దరూ కలిసి ఏం చేస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All