
`రంగు` సినిమా ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న వి. కార్తికేయ దర్శకత్వం వహిస్తున్న `కృష్ణ లంక` హైదరాబదద్‌లో ప్రారంభమైంది. పరుచూరి రవి, నరేష్ మేడి, ఆదర్శ్, రఘు, పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ ప్రధార పాత్రల్లో నటిస్తున్నారు. యారోఫిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సోహ్లా ప్రొడక్షన్స్ , చేతన్ రాజ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ నివ్వగా, సిటీ డీఎస్పీ రాంబాబు కెమెరా స్విఛాన్ చేశారు. `నగరం` దర్శకుడు ప్రేమ్ రాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ `కార్తికేయ మాకు `రంగు` సినిమా నుంచి తెలుసు. విభిన్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ మూవీ మంచి విజయం సాధించాలని, మాకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం` అన్నారు.
దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ “రంగు` సిసినిమా నాకు మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ తరహాలోనే `కృష్ణలంక` సినిమా కూడా ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది. కొత్త తరహా కథా, కథనాలతో, టెక్నికల్‌గా విభిన్నమైన విజువల్స్‌తో రియలిస్టిక్ అప్రోచ్‌తో ఉంటూనే కరెంట్ ఎఫైర్స్‌ను డీల్ చేస్తూ చాలా ఇంపాక్ట్ వున్న స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఖచ్చితంగా ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే చిత్రమవుతుందని నమ్ముతున్నాను` అన్నారు. జనవరి 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మూడు షెడ్యూళ్లలో కంప్లీట్ చేసి సమ్మర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ నిర్మాత సూర్య తెలిపారు.