Homeటాప్ స్టోరీస్ఏడాదిలో నాలుగో ప్లాప్ తిన్న యంగ్ హీరో

ఏడాదిలో నాలుగో ప్లాప్ తిన్న యంగ్ హీరో

ఏడాదిలో నాలుగో ప్లాప్ తిన్న యంగ్ హీరో
ఏడాదిలో నాలుగో ప్లాప్ తిన్న యంగ్ హీరో

సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టడం ఈజీనే. దాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టం. అరెక్స్ 100తో సూపర్ సూపర్ హిట్ కొట్టాడు హీరో కార్తికేయ. ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించడంతో తన రేంజ్ గురించి కొత్త కలలు కన్నాడీ యంగ్ హీరో. తన ఫిజిక్ ను కూడా బాగా పెంచుకుని తనదైన శైలిలో తర్వాతి సినిమా గురించి గొప్పలు చెప్పుకున్నాడు. హిప్పీ సినిమాలో కూడా కార్తికేయ రోల్ విమర్శలకు తావిచ్చింది. తన బాడీనే చూసి ఆరెక్స్ 100 హిట్ అయిందని భావించాడో ఏమో హిప్పీ మొత్తం షర్ట్ విప్పుకునే తిరిగాడు. అవసరం ఉన్నా లేకున్నా షర్ట్ విప్పి విసుగెత్తించాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో కూడా కార్తికేయ మాట్లాడిన మాటలు కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి.

అయితే హిప్పీ ప్లాప్ ను కార్తికేయ అంత సీరియస్ గా తీసుకోలేదు. ఏదో ఫ్లూక్ లో పడిపోయిందని లైట్ తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన గుణ 369 విషయంలో చాలానే ఆశలు పెట్టుకున్నాడు. తన ఇమేజ్ ను కూడా సాఫ్ట్ ప్లే చేసాడు. బజ్ కూడా బానే వచ్చింది. కానీ గుణ 369 కూడా ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలమైంది. సినిమా కంటెంట్ బానే ఉన్నా ఎందుకో కలెక్షన్స్ లో అది మారలేదు. ఆరెక్స్ 100 తర్వాత వరసగా రెండో ప్లాప్ కార్తికేయను పలకరించింది.

- Advertisement -

అయితే ఈసారి కార్తికేయ హీరోగా కాకుండా రూట్ మార్చి నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్ అవతారమెత్తాడు. అయితే రూట్ మార్చినా ఫేట్ మాత్రం మారలేదు. గ్యాంగ్ లీడర్ కు టాక్ బాగున్నా కానీ చిత్రం మాత్రం అంతిమంగా ప్లాపైంది. బ్రేక్ ఈవెన్ అవ్వడంలో విఫలమైంది. దీంతో కార్తికేయకు ఈ ఏడాది హ్యాట్రిక్ ప్లాప్ నమోదైంది. అయినా కూడా కార్తికేయ డల్ అయిపోలేదు. దానికి కారణం అతని చేతిలో 90ml సినిమా ఉండడమే. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈసారి గురి తప్పదని భావించాడు. అయితే 90ml సినిమా మేకింగ్ లో తేడా కొట్టేయడంతో సినిమాకు ప్లాప్ టాక్ చుట్టుముట్టేసింది. వీకెండ్ ముగిసేసరికి సినిమాకు కలెక్షన్స్ పూర్తిగా డల్ అయ్యాయి. దీంతో కార్తికేయకు ఈ ఏడాది నాలుగో ప్లాప్ వచ్చినట్లైంది. ఆరెక్స్ 100తో వచ్చిన హైప్ మొత్తం ఈ నాలుగు ప్లాపులతో తుడిచిపెట్టుకుపోయినట్లైంది.

ఎంత ప్రామిసింగ్ హీరోకైనా ఇక్కడ హిట్లు ఉంటేనే మార్కెట్ ఉంటుంది. కాకపోతే కార్తికేయ ఇలా వరసగా ప్లాపులు రావడంతో అతని మార్కెట్ పూర్తిగా పడిపోయింది. కాకపోతే ఇప్పటికిప్పుడు కార్తికేయకు వచ్చిన ఇబ్బంది అంటూ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు అతని చేతిలో గీతా ఆర్ట్స్ సంస్థ సినిమా ఉంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 సంస్థ నిర్మించనున్న సినిమాలో కార్తికేయ హీరోగా ఎంపికయ్యాడు. గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి కచ్చితంగా మంచి ఇంప్రెషన్ మార్కెట్ లో ఉంటుంది. ఇది కనుక హిట్ అయితే మళ్ళీ కార్తికేయ పుంజుకోవడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All