Homeటాప్ స్టోరీస్ప్లాన్స్ మార్చిందే కానీ గోల్స్‌ని మాత్రం..

ప్లాన్స్ మార్చిందే కానీ గోల్స్‌ని మాత్రం..

ప్లాన్స్ మార్చిందే కానీ గోల్స్‌ని మాత్రం..
ప్లాన్స్ మార్చిందే కానీ గోల్స్‌ని మాత్రం..

`Rx 100` యంగ్ హీరో కార్తికేయ‌ని స్టార్‌ని చేసింది. అందులో త‌ను పోషించిన శివ క్యారెక్ట‌ర్ ఎన్ని సినిమాలు చేసినా ఎప్ప‌టికి గుర్తుండి పోతుంది. అయితే ఈ సినిమా త‌రువాత కార్తికేయ‌ల ఆ స్థాయిలో మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోతున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `చావుక‌బురు చ‌ల్ల‌గా`. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ద్వారా కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. బ‌స్తీబాల‌రాజుగా ఊర‌మాస్ పాత్ర‌లో కార్తికేయ న‌టిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో వుంది. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ కి బ్రేక్ ప‌డింది. ఈ స‌మ‌యాన్ని కార్తికేయ బాగానే వాడుకున్నాడు. త‌న బాడీని మెరుపు తీగ‌లా సిద్ధం చేసుకోవ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా కార్తికేయ సిక్స్ ప్యాక్ బాడీ పిక్స్‌ని సోస్ట్ చేశాడు. దీనికి తోడు ఓ క్యాప్ష‌న్‌ని కూడా అందించాడు. లాక్‌డౌన్ మ‌న ప్లాన్స్‌ని మార్చిందే కానీ మ‌న ల‌క్ష్యాలకు మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ చేయ‌లేక‌పోయింది. అని కార్తికేయ పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది. త్వ‌ర‌లో మ‌రిన్ని కొత్త చిత్రాల్ని కార్తికేయ అంగీక‌రించ‌బోతున్నాడు. అందు కోసం సిక్స్ ప్యాక్ బాడీతో సిద్ధం అయ్యాడ‌ని తెలుస్తోంది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All