Homeన్యూస్కార్తికేయ: నా కెరీర్ మలుపు తిరగబోతోంది

కార్తికేయ: నా కెరీర్ మలుపు తిరగబోతోంది

కార్తికేయ: నా కెరీర్ మలుపు తిరగబోతోంది
కార్తికేయ: నా కెరీర్ మలుపు తిరగబోతోంది

ఆరెక్స్ 100తో హీరోగా పరిచయమైన కార్తికేయ ఆ చిత్రంతో బాగానే బజ్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత కార్తికేయ నుండి సరైన సినిమా రాలేదు. రీసెంట్ గా విడుదలైన చావు కబురు చల్లగా కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ రాజా విక్రమార్క ఈ వారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా కార్తికేయ ఈ సినిమా గురించి తన కెరీర్ గురించి స్పందించాడు.

రాజా విక్రమార్క దర్శకుడు శ్రీ నాకు రెండు గంటలకు పైగా ఈ కథ చెప్పాడు. అప్పుడే అనిపించింది ఈ సినిమా కచ్చితంగా నా కెరీర్ లో మంచి చిత్రం అవుతుందని. ఇప్పుడు సినిమా చూసాను కాబట్టి కాన్ఫిడెంట్ ఉన్నాను. ఈ చిత్రంలో నేను ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నాను. అయితే ఇదేమి టెర్రరిస్ట్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా కాదు.

- Advertisement -

తన సొంత ఊరుకి వచ్చిన హీరో విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కుని దాన్నుండి ఎలా బయటపడ్డాను అన్నదే చిత్రం. వాలిమైలో విలన్ గా నటించాను. అజిత్ సర్ తో నటించడం మర్చిపోలేని అనుభూతి. ఈ సినిమా విడుదల తర్వాత నా కెరీర్ మంచి టర్న్ తీసుకుంటుంది. ప్రస్తుతం రెండు సినిమాలు ఒప్పుకున్నాను. యూవీ క్రియేషన్స్ బ్యానేర్ లో చేస్తోన్న చిత్రం సగం పూర్తయింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో కూడా సినిమా చేయబోతున్నాను.” అని ముగించాడు కార్తికేయ.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All