
ప్రస్తుతం నిఖిల్ వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2లో బన్నీ వాసు నిర్మిస్తున్న `18 పేజెస్` చిత్రంతో పాటు `కార్తికేయ` చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న సీక్వెల్ `కార్తికేయ2`లో నటిస్తున్నాడు. మిస్టీరియస్ టెంపుల్స్ వెనకున్న రహస్యాల్ని ఛేధించే ఓ యువకుడి కథగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడడం, ఆ తర్వాత పెద్ద సినిమాలు వరుస పెట్టి రిలీజ్ అవుతుండడం తో కార్తికేయ 2 రిలీజ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అంత సెట్ అవ్వడం తో సినిమాను జులై 22 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ఇందులో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్ నటిస్తుండగా , రావు రమేష్ , తనికెళ్ళ భరణి , స్వాతి తదితరులు నటిస్తున్నారు.