Homeటాప్ స్టోరీస్కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో : అంచనాలు పెరిగిపోయాయి

కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో : అంచనాలు పెరిగిపోయాయి

కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో : అంచనాలు పెరిగిపోయాయి
కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో : అంచనాలు పెరిగిపోయాయి

నాలుగేళ్ల క్రితం వచ్చిన కార్తికేయ ఎంతటి సంచలనమో అందరికీ తెల్సిందే. థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చందూ మొండేటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా అప్పట్లో ఈ చిత్రం నిలిచింది. అప్పట్లోనే దాదాపు 25 కోట్ల షేర్ ను సాధించింది కార్తికేయ. భక్తికి, లాజిక్ కి ముడిపెడుతూ సాగిన ఈ థ్రిల్లర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించనున్న సంగతి తెల్సిందే. చాలా కాలం నుండి ఈ సీక్వెల్ కు పనులు జరుగుతుండగా స్క్రిప్ట్ కూడా లాక్ అవ్వడంతో సినిమాను లాంచ్ చేస్తున్నారు. అయితే అంతకంటే ముందే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను రూపొందించారు.

ఆ కాన్సెప్ట్ వీడియో ఆసక్తికరంగా ఉంటూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిందనే చెప్పాలి. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరత ఖండే.. అంటూ మన దేశాన్ని వివరిస్తూ కాన్సెప్ట్ వీడియో మొదలైంది. 5118 ఏళ్ల క్రితం ముగిసిన యుగం అని ద్వాపర యుగం గురించి చెప్పారు. అలాగే ఆ యుగం నాటి అనంత జ్ఞాన సంపద, దానికోసం అన్వేషణ, స్వార్థానికి ఒకరు సాధించడానికి ఒకరు అంటూ చాలా ఆసక్తికరంగా సినిమా కాన్సెప్ట్ ను చెప్పుకుంటూ వచ్చారు.

- Advertisement -

“అతని సంకల్పానికి సాయం చేసిన వారెవరు?” అంటూ హీరో ముఖాన్ని రివీల్ చేయకుండా చూపించారు. వీడియోను బొమ్మల రూపంలో రూపొందించడం బాగుంది. మొత్తానికి కార్తికేయ 2లో కూడా అన్వేషణ ప్రధానంగా ఉండనుందని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించనుంది.

ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ ను ఈ చిత్రంలో టచ్ చేయనున్న నేపథ్యంలో కార్తికేయ 2 పై ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగజేయడంలో విజయవంతమయ్యారు. చైత్రంలో చిత్రీకరణ ప్రారంభం అని వేశారు. అంటే ఉగాది దాటాక షూటింగ్ మొదలవుతుందన్నమాట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All