
కార్తి హీరోగా నటిస్తున్న చిత్రం `సుల్తాన్`. బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `కేజీఎఫ్` ఫేమ్ రామచంద్రరాజు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఇప్పటికే ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఆ అంచనాలని మరింత పెంచేలా ఈ మూవీ ట్రైలర్ వుంది. బుధవారం ఈ చిత్ర ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. మహా భారతంలో పాండవుల వైపు కాకుండా కృష్ణుడు కౌరవుల వైపు వుంటే ఎలా వుంటుంది అనే కాన్సెప్ట్‌తో ఆద్యంత ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
`అది ఏనుగు గుంపు.. అంటూ విలన్ రామచంద్రరాజు వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. 2 నిమిషాల పదహారు సెకండ్ల నిడివిగల ఈ ట్రైలర్ పవర్‌ఫుల్ డైలాగ్‌లతో.. ఆసక్తికరమైన సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. హీరోయిన్ రష్మిక పల్లెటూరి యువతిగా కార్తీని ఆడుకునే అమ్మాయిగా కనిపించింది. నెపోలియన్, మలయాళ నటుడు లాల్ కీలక పాత్రలో నటించారు. యోగి బాబు, రష్మిక, కార్తీ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. డ్రీమ్ వారియర్ బ్యానర్ నుంచి సినిమా అంటే ప్రత్యేకంగా చూస్తారు. ఆ ప్రత్యేకతలన్నీ వున్న సినిమా `సుల్తాన్`. వంద మందిని లీడ్ చేసే యువకుడిగా కార్తీ పాత్ర భిన్నంగా సాగుతున్న ఈ చిత్రం కార్తీకి మరో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించేలా వుంది.
https://t.co/BummImAo3b#SulthanTrailer #SulthanFromApril2 @Karthi_Offl #RowdilaitheBayapadala ????????????
— Rashmika Mandanna (@iamRashmika) March 24, 2021
