Homeటాప్ స్టోరీస్ఖైదీతో హిట్ కొట్టి  దొంగ గా మళ్లీ వస్తున్న కార్తీ

ఖైదీతో హిట్ కొట్టి  దొంగ గా మళ్లీ వస్తున్న కార్తీ

Karthi New Movie Donga coming For Christmas Season
Karthi New Movie Donga coming For Christmas Season

ఈ సంవత్సరం దీపావళి సీజన్ కి ఆల్రెడీ “ఖైదీ” అనే సినిమా రిలీజ్, సూపర్ హిట్ సొంతం చేసుకున్న తమిళ హీరో కార్తీ, మళ్లీ ఇదే సంవత్సరం క్రిస్మస్ సీజన్ కి  “దొంగ” అనే సినిమాతో మళ్లీ మన ముందుకు రాబోతున్నాడు.

దీపావళికి రిలీజ్ అయిన సినిమాలు అన్నింటిలోనూ ఎక్కువ కలెక్షన్లతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది ఖైదీ. “ఢిల్లీ” ఒక యావజ్జీవ ఖైదీ పాత్రలో కార్తీ ఓదిగిపోయిన తీరు విమర్శకులను సైతం మెప్పించింది.  మొదట అందరూ దీపావళి సీజన్ కి భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నవిజయ్ “బిగిల్” సినిమాకి పోటీగా కార్తీ సినిమా రిలీజ్ చేస్తూ ఉండటంతో..  మొదట అతన్ని తప్పుబట్టినా తరువాత ఆ సినిమా యొక్క మ్యాజిక్ కి కనెక్ట్ అయిపోయారు.

- Advertisement -

ప్రస్తుతం కార్తి గతంలో దృశ్యం అనే సూపర్ హిట్ సినిమా తీసిన దర్శకుడు జీతూ జోసెఫ్ తో దొంగ అనే సినిమా చేశాడు.  ఈ సినిమాలో అతనికి తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు సత్యరాజ్ , అక్క పాత్రలో అతని వదిన జ్యోతిక నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తెలుగు టీజర్ ను విడుదల చేయగా దానికి విశేషమైన స్పందన వస్తోంది.

టీజర్ లో కార్తీ యొక్క నటన ను బట్టి అతను ఒక దొంగ  లేదా గ్యాంగ్ స్టర్ అని అనుకోవచ్చు. తన తమ్ముడు కోసం ఎదురు చూసే అక్క పాత్రలో జ్యోతిక నటన చాలా ఎమోషనల్ గా ఉంది. సినిమా టైటిల్ కార్డ్స్ లో మొదట కార్తి,జ్యోతిక, సత్యరాజ్ పేర్లు దర్శకుడు వేశాడు అంటే…  సినిమాలో చాలా వరకు కథ ఈ మూడు ముఖ్య పాత్రల ఆధారంగానే ఉంటుంది అనుకోవచ్చు.

అక్క కోసం ఎవరినైనా ఎదిరించే తమ్ముడు గా & తనకు అన్యాయం చేసిన వాళ్లకి ఎదురుతిరిగే మాస్ హీరో పాత్రలో కార్తీ నటన చాలా బాగుంది. గతంలో తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఛాయాగ్రహణం బాధ్యతలు అందించిన ఆర్.డి.రాజశేఖర్ గారు ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. మనందరికీ బాగా గుర్తుండిపోయిన తమిళ 96 సినిమాతో పాటు, అనేక అద్భుతమైన సినిమాలకు స్వరాలు అందించిన గోవింద్ వసంత ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్.

గతంలో భువనచంద్ర, వెన్నెలకంటి, శ్రీ రామకృష్ణ లాంటి వారి మాదిరిగా ప్రస్తుతం డబ్బింగ్ అవుతున్న ప్రధానమైన చిత్రాలకు రచన చేస్తున్న హనుమాన్ చౌదరి ఈ సినిమాకు కూడా రచయిత గా వ్యవహరించారు. సాహిత్యాన్ని తమిళం నుంచి ఏదో మొక్కుబడిగా అనువాదం చేయకుండా,  మన తెలుగు సాహిత్య రచయిత అయిన రామజోగయ్య శాస్త్రి గారితో పాటలు చేయించుకుంటున్నారు అంటే తెలుగులో కూడా ఈ సినిమా మీద  వారికున్న అంచనాలు మనం అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాలో అలనాటి అందాల నటి షావుకారు జానకి గారు ఒక కీలక పాత్రలో నటించారు. ఏది ఏమైనా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలు, కొత్త కొత్త పాత్రలతో విభిన్నంగా కనిపించాలని, నటించాలని, సినిమాలు చేయాలని తపించే కార్తీకి ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All