
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం తరువాత బాలీవుడ్ సెలబ్రిటీలకు కంటి మీద కునుకు వుండటం లేదు. ఫ్యాన్స్, సెలబ్రిటీస్‌లోని ఓ వర్గం బాలీవుడ్ లో వున్న బంధు ప్రీతిపై మండిపడుతున్నారు. సంచలన వ్యాఖ్యలు చేస్తూ కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ , అలియాభట్‌లని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. వరుస ట్వీట్‌లతో వారికి పిచ్చెక్కిస్తున్నారు.
ఈ బాధని భరించలేని కొంత మంది సోషల్ మీడియాలోకి ఎంటర్ కావడానికే భయంతో వణికిపోతున్నారు. ఎక్కడ ట్వీట్ పెడితే నెటిజన్స్ ఆడుకుంటారోనని భయపడుతూ సోషల్ మీడియా వంక కూడా చూడటం లేదు. ముఖ్యంగా కరణ్ జోహార్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నెటిజన్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా కరణ్ ని ఆడుకుంటున్న విషయం తెలిసిందే. ఈ టార్చర్‌ని భరించలేక కరణ్ తాజాగా ఓ ప్రైవేట్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకున్నారు.
Karanaffairs పేరుతో కొత్తగా ఓ ప్రైవేట్ అకౌంట్‌ని ప్రారంభించారు. ఇది ప్రైవేట్. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయాయి. కరణ్ అప్రూవ్ చేసిన వారు మాత్రమే ఈ అకౌంట్‌ని చూసేందుకు వీలుంటుంది. మిగతా వారికి ఈ అకౌంట్ డిటైల్స్ తెలియవు. ఈ అకౌంట్ ద్వారా తనని ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్‌కి దూరంగా వుండొచ్చని కరణ్ భావిస్తున్నారట. కరణ్‌ని ఈ ప్రైవేట్ అకౌంట్‌లో ఫాలో అవుతున్న వారు అలియా భట్, మలైకా అరోరా.