Homeటాప్ స్టోరీస్క‌ర‌ణ్ జోహార్‌ని కూడా ప్ర‌శ్నించాల్సిందే!

క‌ర‌ణ్ జోహార్‌ని కూడా ప్ర‌శ్నించాల్సిందే!

క‌ర‌ణ్ జోహార్‌ని కూడా ప్ర‌శ్నించాల్సిందే!
క‌ర‌ణ్ జోహార్‌ని కూడా ప్ర‌శ్నించాల్సిందే!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం బాలీవుడ్‌లో పెను దుమారాన్ని రేపుతున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా అభిమానులు, కొంత మంది సెల‌బ్రిటీలు బాలీవుడ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక్క‌డున్న బంధుప్రీతిపై మండిప‌డుతున్నారు. దీనికి కొంత మంది బ‌డా నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, స‌ల్మాన్‌ఖాన్‌, క‌ర‌ణ్ జోహార్‌, అలియా భ‌ట్, మ‌హేష్ భ‌ట్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ వంటి వాళ్లు కార‌ణ‌మ‌ని ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు.

తాజాగా కంగ‌న ర‌నౌత్ కూడా బాలీవుడ్ లో వున్న నెపోటిజ‌మ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. గ‌త కొంత కాలంగా బాలీవుడ్ బిగ్ షాట్స్‌పై కంగ‌న ప్ర‌త్య‌క్ష్యంగా వార్ డిక్లేర్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా సుశాంత్ మృతి ప‌ట్ల అనుమానంతో పోలీస్ వ‌ర్గాలు ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీస్‌ని విచారిస్తున్న విష‌యం తెలిసిందే. య‌ష్ రాజ్ ఫిల్మ్స్‌తో పాటు ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు, నిర్మాత సంజ‌య్ లీలా భ‌న్సాలీని కూడా ప్ర‌శ్నించారు. అయితే క‌ర‌ణ్ జోహార్‌ని కూడా ఈ విష‌యంపై ప్ర‌శ్నించాల్సిందే అంటోంది కంగ‌న ర‌నౌత్‌.

- Advertisement -

సుశాంత్ మ‌ర‌ణంపై ఎంక్వైరీ చేస్తున్న ముంబై పోలీసులు క‌ర‌ణ్ జోహార్‌ని, ఆదిత్య చోప్రాని, హ‌మ‌స్త్రష్ భ‌ట్‌, సినీ విమ‌ర్శ‌కుడు రాజీవ్ ముసంద్లాను ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని, వారి ప‌లుకుబ‌డి కార‌ణంగానే వారిని వ‌దిలేశారా? ప‌్ర‌శ్నిస్తోంది. దీనిపై బాలీవుడ్ వ‌ర్గాల నుంచి మాత్రం ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All