Homeగాసిప్స్అఖిల్ తో కరణ్ జోహార్ మూవీ..?

అఖిల్ తో కరణ్ జోహార్ మూవీ..?

Karan johar planning big movie with akhil
Karan johar planning big movie with akhil

అఖిల్ అక్కినేనికి మొత్తానికి ఒక విజయం దక్కింది. తన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ తో సక్సెస్ ను అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అఖిల్..ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం పూర్తిగా మారిపోయాడు. భారీగా కండలు పెంచేసి అబ్బో అనిపిస్తున్నాడు. ఇక ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే అఖిల్ తో అగ్ర నిర్మాత కరణ్ జోహార్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిందని..త్వరలో అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జున బాలీవుడ్ మూవీస్ చేస్తున్నారు. నాగ చైతన్య కూడా ఆమిర్ ఖాన్‌తో కలిసి నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ కన్‌ఫర్మ్ అనే టాక్ అభిమానులను సంబరాలకు గురి చేస్తుంది. మరి ఇది నిజామా కదా అనేది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All